అంశం : మతి మరుపు
తేది : 07-11-2020
సవ్వడి సంఖ్య : 35
శీర్షిక : వరం ..శాపం...
జ్ఞాన విజ్ఞానాల చిరునామా
జీవరాశి అంతరాల సంకేతం
విశ్వరాశి పరిజ్ఞాన సుసంపన్నం
అదేకద మానవాళి తిరుగులేని ఆయుధం
మెరుపు లాంటి ఆలోచనలు
మంచి చెడుల విచక్షణలు
మేథో మథనాల ఎంపికలు
మానవాళి కున్న ప్రత్యేకతలు...
మరుపు మానవ సహజం
బాధల్లో బతుకు తోవల్లో
కొంత వరకు వరమయునా
శ్రుతి మించితే ఇబ్బందులే...
అమ్మ దూరమయినా
ఆత్మ బంధువు దూరమయినా
మరుపంటూ లేకపోతే
మతులు పోయే స్థితులే ....
వయసు మీరినాక
మనసు ముసలిదౌతూ
మరుపులే కొన్నిసార్లు
మనిషికి వరాలు శాపాలు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment