నగునూరి రాజన్న
అంశం - గొడుగు
తేదీ - 06-09-2019
శీర్షిక - గొడుగు స్వగతం
సంఖ్య - 281
అంతరిక్షపు వింత ఆకారపు ఆకాశమో ....
ప్రకృతి ప్రసవించిన కొన్ని చెట్ల ఆకారాలో
మానవాళి మేధకు జోడై నిలిచాము ఛత్రంగా....
ఏది ఏమైతేనేం ....
ఆదిమ కాలమే మా ఆరంభం అనడానికి
పురాణాల సాక్షిగా సాగిన మా పయనం
జమదగ్నికి రవి అందించిన బహుమానం...
పరంధాముని సేవకు పట్టు బట్టలలో నిలిచాం ...
రాజు పేదల బేధాలు రంగుల్లో మీరు చూపినా
ప్రయోజనాల పక్షపాతం పాటించలేదు మేము.....
మునులకు తపస్యులకు పల్లె వాసులకు
ఎందరెందరికో స్ఫూర్తి నింపాము తాటాకుల ఛత్రంగా...
కదిలిన కాలం మారిన నాగరికతల కాంతుల్లో
నలుపు తెలుపులు నానా వర్ణములకు మారాము...
రమ్యమైన వస్త్ర లతలు చేరి మడతలకు మారి
ఎండా వానలకు ఎదురొడ్డి నిలుస్తున్నాం ....
మార్పు సహజమన్న మాటకు కట్టుబడి
కాలానుగుణంగా కదులుతూనే ఉన్నాం ...
కాంతి పరావర్తన కళలకు సాధనంగా ....
సాంకేతికతల సమాహారపు సరంగుగా
సంకేతాల సంగ్రహనానికి సై అంటూ ....
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
అంశం - గొడుగు
తేదీ - 06-09-2019
శీర్షిక - గొడుగు స్వగతం
సంఖ్య - 281
అంతరిక్షపు వింత ఆకారపు ఆకాశమో ....
ప్రకృతి ప్రసవించిన కొన్ని చెట్ల ఆకారాలో
మానవాళి మేధకు జోడై నిలిచాము ఛత్రంగా....
ఏది ఏమైతేనేం ....
ఆదిమ కాలమే మా ఆరంభం అనడానికి
పురాణాల సాక్షిగా సాగిన మా పయనం
జమదగ్నికి రవి అందించిన బహుమానం...
పరంధాముని సేవకు పట్టు బట్టలలో నిలిచాం ...
రాజు పేదల బేధాలు రంగుల్లో మీరు చూపినా
ప్రయోజనాల పక్షపాతం పాటించలేదు మేము.....
మునులకు తపస్యులకు పల్లె వాసులకు
ఎందరెందరికో స్ఫూర్తి నింపాము తాటాకుల ఛత్రంగా...
కదిలిన కాలం మారిన నాగరికతల కాంతుల్లో
నలుపు తెలుపులు నానా వర్ణములకు మారాము...
రమ్యమైన వస్త్ర లతలు చేరి మడతలకు మారి
ఎండా వానలకు ఎదురొడ్డి నిలుస్తున్నాం ....
మార్పు సహజమన్న మాటకు కట్టుబడి
కాలానుగుణంగా కదులుతూనే ఉన్నాం ...
కాంతి పరావర్తన కళలకు సాధనంగా ....
సాంకేతికతల సమాహారపు సరంగుగా
సంకేతాల సంగ్రహనానికి సై అంటూ ....
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment