చేయూత
తేదీ - 26-12-2019
శీర్షిక - సహకారం.... సుభిక్షం
సంఖ్య -
339
భారమైన వేళ మనిషి
భావన చెందే ప్రతి ఆలోచనకు
భరోసా కల్పిస్తూ బతుకు పయనానికి
బాటలు వేసేదే .......
అమ్మ అందించిన ఆపన్న హస్తం
నాన్న వేయించిన బుడి బుడి అడుగులు....
తోబుట్టువులందించిన మమతానురాగాలు....
గురువులు ఉపదేశించిన ఓంకార నాదం ....
ప్రత్యక్షంగానో పరోక్షంగానో
ప్రతీది పరికిస్తే చేయూతె.....
ప్రకృతిలో పుట్టి పెరిగిన మనం
ప్రకృతి పుణికి పుచ్చుకున్న సుగుణాలను
కళ్లారా చూసినా కనికరం లేకుండా
ధ్వంసం చేస్తున్నాం ....
భీభత్సానికి అంకురాలేస్తున్నాము....
మనిషి బ్రతికి... బ్రతుకనిస్తే... చాలు
మాటలు కాకుండా మమతలు పంచి
క్రమశిక్షణ స్వీయ నియంత్రణలతో
ఎదుటి వారినుండి కోరేదే....
ఎల్లప్పుడు పాటిస్తే .....
అదే సహకారం .... అంతా సుభిక్షం......
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment