కలల అలజడి
23-01-2020
శీర్షిక - మార్గదర్శకాలు
సంఖ్య - 347
కిట కిట తలుపులు వాలిపోగానే
చక చక సాగే వర్ణ చిత్రాల వయ్యారాలు
ఆశల తలపుల ఆశయాల గమ్యాల
ఊహల చిత్రాలు ఊరేగే సమయాలు....
కమ్మని అనుభూతుల గనులు కొన్నయితే
అలజడి రేపే గాలి దుమారాల మరి కొన్ని ....
జరిగిన ఘటనల దాఖలాలు కొన్నయితే
ఊహించుకున్న కార్యక్రమ ఫలితాలు కొన్ని.....
మంచి చెడుల పుష్ప మాలికలు కొన్నయితే
తీపి చేదుల జ్ఞాపకాల దొంతరలు కొన్ని....
మనోఫలకమంతా మసక బారగానే
మంచి ముత్యములై మురిపిస్తాయి......
అందరిని పొందుగా ఆదరిస్తాయి
ఆశలు నింపి ఆదరంగా పలకరిస్తాయి
అలజడి రేపినా ఆనందాలు మిగిల్చినా
కలలు లీలగా కనవల్సిందే ......
ఇలలో పట్టుదలగా గమ్యాలు చేర ....
కలలు కూడా జీవన మార్గదర్శకాలై
గురువుల స్థానం పదిలపరుస్తాయి...
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment