చలన సంగీతం
తేదీ - 25-12-2019
శీర్షిక - చలన చిత్ర సంగీతం
సంఖ్య -
338
అలసి సొలసిన మనసులకు
ఆలంబన తంత్రం సంగీతం ....
అలవి కాని అనారోగ్యాలకు సైతం
ఆదుకునే సంజీవిని ఔషధం....
కనగలిగిన కమనీయ దృశ్య
మాలికలు సాహిత్యమై జాలువారు ....
వినగలిగిన ఇంపైన రాగ శబ్ద
భావనలు సంగీతమై రంజిల్లు!
పరికించి పరవశించే మనసుకు
ప్రకృతి నిండా ప్రతి క్షణం వినిపించే శబ్దం...
పరమ విశిష్టమైన సంగీతమే...
ఉదయాత్పూర్వపు పక్షుల కిల కిల రవములు
పచ్చని చెట్ల వీచే పైర గాలి
పండు వెన్నెల్లో కదిలే కడలి కెరటం....
రసాత్మకమైనా భావాత్మకమైనా
స్థితి ప్రధానమైనా గతి ప్రధానమైనా
రాజు ఆస్థానమైనా దేవస్థానమైనా
సాటి మనిషిని రంజింపజేసేది సంగీతం....
ముచ్చటగా మూడు గంటల
కథన సీమకు మువ్వన్నెలు అద్ది
ముదము గొలుపు మూడునిమిషాల
గీతముతో మురిపమైన సంక్షిప్తతో ..... .
చదువ సొంపైన సాహిత్యం
చెవులకింపైన సంగీతం
చలన చిత్రాల్లో రాజ్యమేలి
చక్రం తిప్పలేదా... ఒకనాడు ....
కళా తపస్వి కాశీనాథుడు
కదిలించలేదా ప్రతిఒక్కరిని
ఆత్మ గౌరవంతో ఆరంభించి ...
అడుగడుగున మది మదిన గెలుస్తూ
ఆణిముత్యాలుగ ఆవిష్కరించె గదా..
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment