మేధో మధనం
30-12-2019
శీర్షిక - మంచిని పోషించ....
సంఖ్య - 340
విశ్వ ప్రాణ కోటిలో కలిగిన
వింత పోకడ మనిషిదే సుమా!
విశిష్ట లక్షణాలతో విను వీధిన
వినుతికెక్కే మానవుండు......
బాధ్యతల గంపలు తలకెక్కితే
బతుకు దార్లు వెతుక్కుంటుంది.....
అన్నీ అందిపుచ్చుకున్నట్టు అందుబాటైనా ....
ఆరాటపడే అంతరంగపు ఆలోచనలకు
బహుశా దగ్గరి దార్ల దాఖలాలు కూడా దక్కవొచ్చు .... ..
పరంధామునికైనా పాల సముద్రం
చిలికితే గాని చిక్కలేదు అమృతం......
పలుగురాళ్ళ పరికరాలు మాయమై
పరిభ్రమించే చక్రంతోనే ఫరిఢవిల్లాము.
పారిశ్రామిక విప్లవంతో పరుగులందుకున్న
పయనం..... కొంత సేద దీరినా
సాంకేతికత సొబగులద్దుకుని
సరాసరి నింగికెగిసె కదా.....
మదించి మత్తగజాన్ని సైతం
బంధించగలిగిన మానవుడు....
మానవాళి మనుగడకే.....
మంచిని పోషించడానికే పరిమితమవ్వాలి...
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment