ఉందిలే మంచికాలం
తేదీ -21 -12 -2019
శీర్షిక - ఆశయాల గమ్యాలు....
సంఖ్య -
అల్లారు ముద్దైన అమ్మల చెంత బాల్యం
ఆటపాటల చెడుగుడు నాన్నల లాల్యం
అప్రమత్తమై ఎదిగే ఆట కోయిల చదువుల కౌమార్యం
వ్యాపార ఉద్యోగ బరువు బాధ్యతల
యవ్వనం
కన్నతల్లి దండ్రుల కని పెంచిన పిల్లల
ఆత్మీయ బంధాల మధ్య వయస్సు ....
ఉందిలే మంచి కాలం ముందు ముందునా.....
అనుకుంటుండాగానే.... .
గిర్రున తిరిగిన కాల మహిమల యాతనలో
అక్కున చేర్చుకున్న
పెద్దరికం......
అలిగిన వరుణుడి అనావృష్టి అతివృష్టిలను
అక్కున చేర్చుకున్నలక్షల హాలికులు గుప్ పెడు
గుండెల్లో నిలిచిన ఆశల గంపను నెత్తికెత్తుకుని
కోట్ల జనాభాను పోషించ... ఉందిలే మంచి కాలం....
అంటూ కాలం మార్పుల కలి ప్రభావాల
ప్రతి ఏరువాకకు ఆయత్తమౌతూనే ఉంటారు .....
ఆదరిస్తే సమవృష్టి కోపగిస్తే అనావృష్టి
అయినా హాలికునికి గుండెనిండా ఆశే....
ఆశల ఊపిరులు నిండిన మనిషి
ఆశయాల గమ్యాల సాధనకు
చేప నీటిలో చందంగా ఈదుతూనే ఉంటాడు.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment