నగునూరి రాజన్న
అంశం: ప్రలోభాలు
తేదీ : 06 -12 -2018
శీర్షిక: పారా హుషార్ పౌర మిత్రమా....
సంఖ్య : 105
అమ్మ తప్ప అన్నీ దొరికే అంగట్లో
ఆశల పల్లకీలో ఊరేగే జీవికి
అదీ ఇదీ అనే తేడా లేకుండా
అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.
పరమోత్తమం మానవ జన్మని
పురాణాలు ప్రస్తుతించినా.......
పరిపాలనంత మానవ సేవని
ప్రజా రాజ్యాంగం ప్రమాణించినా .....
రాజకీయమంతా వాణిజ్య సమమని
మకిలిపడ్డ మానవ జన్మల సాక్షి
పరమ చెత్తాయె కలికాలాన......
ఫలితమాశించి
పక్కవాణ్ణి మోసగించి
పనులు చక్కబెట్టుకునే
ప్రబుద్ధతే పచ్చి ధర్మమైంది మిత్రమా .....
అలవికాని పనులన్నీ
అవలీలగా చేసేస్తామంటూ
ఆకాశానికెత్తుకుని అమాంతంగా
బోల్తా కొట్టించడమే ఆచారమైంది సోదరా....
ప్రజా క్షేత్ర ప్రత్యక్ష వాగ్దాటి పోటీ
పరిధి ముగిసి ....
పరోక్ష ప్రలోభాల ప్రభకు తెర లేచింది.
కుల మత ప్రాంత భాషా వర్గ కుత్చితాలకు....
పారా హుషార్ పౌర మిత్రమా ....
నగునూరి రాజన్న
అంశం: ప్రలోభాలు
తేదీ : 06 -12 -2018
శీర్షిక: పారా హుషార్ పౌర మిత్రమా....
సంఖ్య : 105
అమ్మ తప్ప అన్నీ దొరికే అంగట్లో
ఆశల పల్లకీలో ఊరేగే జీవికి
అదీ ఇదీ అనే తేడా లేకుండా
అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.
పరమోత్తమం మానవ జన్మని
పురాణాలు ప్రస్తుతించినా.......
పరిపాలనంత మానవ సేవని
ప్రజా రాజ్యాంగం ప్రమాణించినా .....
రాజకీయమంతా వాణిజ్య సమమని
మకిలిపడ్డ మానవ జన్మల సాక్షి
పరమ చెత్తాయె కలికాలాన......
ఫలితమాశించి
పక్కవాణ్ణి మోసగించి
పనులు చక్కబెట్టుకునే
ప్రబుద్ధతే పచ్చి ధర్మమైంది మిత్రమా .....
అలవికాని పనులన్నీ
అవలీలగా చేసేస్తామంటూ
ఆకాశానికెత్తుకుని అమాంతంగా
బోల్తా కొట్టించడమే ఆచారమైంది సోదరా....
ప్రజా క్షేత్ర ప్రత్యక్ష వాగ్దాటి పోటీ
పరిధి ముగిసి ....
పరోక్ష ప్రలోభాల ప్రభకు తెర లేచింది.
కుల మత ప్రాంత భాషా వర్గ కుత్చితాలకు....
పారా హుషార్ పౌర మిత్రమా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment