నగునూరి రాజన్న
అంశం : ఆరోగ్య సమాజం
తేదీ 03 -12 -2018
శీర్షిక : స్వచ్చ అధికార రాజకీయం
సంఖ్య: 102
అంతులేని జనాభాల మత లెక్కలు
అతలాకుతలం అవుతున్న ఖజానాలు
బాల్య పౌష్టికాహార నిధులకై
ప్రకటనా దేవురింపుల బాధలు
గడియారం ముల్లులతో పోటీ
గమ్మత్తుగ కనుమరుగవుతున్న జీవిత బ్యూటీ
గజిబిజి పాలవుతున్న సావాసపు తోటి
గల్లంతవుతున్న ప్రేమలు సాటి
స్వార్థచింతనలకు సరంగులౌతున్న వైద్యులు
ఉచ్చనీచములు మరుస్తున్న ఫార్మసీలు
పెచ్చుమీరుతున్న లాభాల లాబులు
వెరసి సగటు మనిషి ఈ జలగలు పాలు.
సచివుల సన్నాయిల నొక్కులు
స్వార్థ రాజకీయ కుట్రలు కుతంత్రాలు
అధికారుల నిర్లక్ష్యపు నీలి నీడలు
అలవి కాని అవినీతి సామ్రాజ్యాలు.
కంపరమెత్తే కల్తీల నివారణలకై
తామరతంపరులుగా వెలసే సంస్థలపై
ఉత్తుత్తి మాటలు కట్టిపెట్టి ఉక్కుపాదం మోప
సత్వరమే స్పందించగల స్వచ్చమైన
అధికార రాజకీయుల ఆవశ్యం ఎంతో ఉంది.
నగునూరి రాజన్న.
అంశం : ఆరోగ్య సమాజం
తేదీ 03 -12 -2018
శీర్షిక : స్వచ్చ అధికార రాజకీయం
సంఖ్య: 102
అంతులేని జనాభాల మత లెక్కలు
అతలాకుతలం అవుతున్న ఖజానాలు
బాల్య పౌష్టికాహార నిధులకై
ప్రకటనా దేవురింపుల బాధలు
గడియారం ముల్లులతో పోటీ
గమ్మత్తుగ కనుమరుగవుతున్న జీవిత బ్యూటీ
గజిబిజి పాలవుతున్న సావాసపు తోటి
గల్లంతవుతున్న ప్రేమలు సాటి
స్వార్థచింతనలకు సరంగులౌతున్న వైద్యులు
ఉచ్చనీచములు మరుస్తున్న ఫార్మసీలు
పెచ్చుమీరుతున్న లాభాల లాబులు
వెరసి సగటు మనిషి ఈ జలగలు పాలు.
సచివుల సన్నాయిల నొక్కులు
స్వార్థ రాజకీయ కుట్రలు కుతంత్రాలు
అధికారుల నిర్లక్ష్యపు నీలి నీడలు
అలవి కాని అవినీతి సామ్రాజ్యాలు.
కంపరమెత్తే కల్తీల నివారణలకై
తామరతంపరులుగా వెలసే సంస్థలపై
ఉత్తుత్తి మాటలు కట్టిపెట్టి ఉక్కుపాదం మోప
సత్వరమే స్పందించగల స్వచ్చమైన
అధికార రాజకీయుల ఆవశ్యం ఎంతో ఉంది.
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment