Saturday, February 9, 2019

ప్రాతః స్మరణీయులు

నగునూరి రాజన్న
అంశం : ప్రాతః స్మరణీయులు
తేదీ : 04 - 12 - 2018
శీర్షిక : పూజ్యులు
సంఖ్య : 103 

ఉత్తమ జన్మకు ఉభయులు మూలం
తప్పక మనము తలుచుట భావ్యం
మాతృ దేవోభవ... పితృ దేవోభవ..

సన్మార్గమునకు జ్ఞాన వివేచనం
ఎందరెందరో మార్గ నిర్దేశకులు
వారందరికి వందనాలు... గురు దేవోభవ.

శరీర పోషణకు సవాలక్ష అవసరాలు
కోట్ల జనాభాకు కొసరి అందిస్తున్న
జైకిసానుకు జన్మంతా వందనాలు.

శుభ్రంగా తిని నిబ్బరంగా నిద్రించ
దేశ ప్రజలందరికి నిశ్చింత....
జైజవానుకు నిండ నూరేళ్ళు.

బానిస సంకెళ్ళ బందిఖానాకు
బంధవిముక్త యోధులెందరో
బతుకంతా వినమ్రత ప్రకటిస్తా...

జీవన గమనపు రహదారంతా
ఫలితం పొందిన ప్రతి క్షణం
సుఖమయమయ్యే సుందరం...
కారణజన్ములంతా పూజ్యులు ప్రాత:స్మరణీయులే...

నగునూరి రాజన్న

No comments:

Post a Comment