నగునూరి రాజన్న
అంశము: నిర్ణయం
తేది : 07-12-2018
శీర్షిక : నిర్ణయాలు
సంఖ్య : 106
అమ్మా నాన్నల ఆలంబనలో
అడుగడుగున ఆప్యాయతలు నిండ
ఆరంభపు బతుకు గమనంలో
బడిబాటన ఆచితూచిన
బాల్య నిర్ణయాలు సైతం
బతుకు గమ్యాన్ని శాసించు.....
నిరంతర పోరు బాటలో
నిరుపమాన వేగం పెరగ
నిలకడలేని నిజస్థితులలో
నిర్ణయాల సమయం తగ్గి
నిత్య అతలాకుతలాలు......
కలి కాలాన నిత్య కృత్యపు
కౌమార్యపు నీలి నీడల
కాల ఘటనల నిర్ణయాలు
కకావికలమౌతున్న కథానికలెన్నో
కదిలిస్తున్నవి గుండె చెరువై.....
స్వార్థ చింతనలే సత్సంగమయి
ప్రలోభాల వాసనల ప్రభావితాలయి
పరితపనల ఆపేక్షల నిర్ణయాలు
ప్రజా జీవితాన ప్రతిక్షణం
ప్రతిబంధక కంటకాలే.........
పరిణతి నిండిన
ప్రశాంత నిర్ణయాలు
ప్రజాబాహుల్యమై ఫరిడవిల్లు
పదికాలాలు ప్రజ్వరిల్లు.......
అపర చాణుక్యుడైన
ఆర్థిక నిపుణుడు మన పి వి గారి వలె.....
నగునూరి రాజన్న
అంశము: నిర్ణయం
తేది : 07-12-2018
శీర్షిక : నిర్ణయాలు
సంఖ్య : 106
అమ్మా నాన్నల ఆలంబనలో
అడుగడుగున ఆప్యాయతలు నిండ
ఆరంభపు బతుకు గమనంలో
బడిబాటన ఆచితూచిన
బాల్య నిర్ణయాలు సైతం
బతుకు గమ్యాన్ని శాసించు.....
నిరంతర పోరు బాటలో
నిరుపమాన వేగం పెరగ
నిలకడలేని నిజస్థితులలో
నిర్ణయాల సమయం తగ్గి
నిత్య అతలాకుతలాలు......
కలి కాలాన నిత్య కృత్యపు
కౌమార్యపు నీలి నీడల
కాల ఘటనల నిర్ణయాలు
కకావికలమౌతున్న కథానికలెన్నో
కదిలిస్తున్నవి గుండె చెరువై.....
స్వార్థ చింతనలే సత్సంగమయి
ప్రలోభాల వాసనల ప్రభావితాలయి
పరితపనల ఆపేక్షల నిర్ణయాలు
ప్రజా జీవితాన ప్రతిక్షణం
ప్రతిబంధక కంటకాలే.........
పరిణతి నిండిన
ప్రశాంత నిర్ణయాలు
ప్రజాబాహుల్యమై ఫరిడవిల్లు
పదికాలాలు ప్రజ్వరిల్లు.......
అపర చాణుక్యుడైన
ఆర్థిక నిపుణుడు మన పి వి గారి వలె.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment