Saturday, February 9, 2019

బాల సాహిత్య్రం 2

బాల సాహిత్య్రం 2 

మురిపమైన బాలలం
ముద్దబంతి పూవులం
ముద్దు ముద్దు గుమ్మలం
ముదము పంచు పిల్లలం 

పచ్చనైన మొక్కలం
ప్రకృతి రమణీయతం
జీవ జలల ధారలం
జగతి ప్రాణ వాయువులం

వికసించే పువ్వులం
విరబూసే నవ్వులం
విహరించే గువ్వలం
విశ్వానికి విజేతలం

బంతిపూల మాలలం
బంగారు రువ్వులం
బోసి నవ్వుల ఆస్తులం
బోలా శంకరు వారసులం

అందమైన తారలం
అమ్మా నాన్న ఆశలం
తాతవ్వల తోడులం
తరువు పంచు నీడలం

సరస్వతీ పుత్రులం
శ్రమించే వీరులం
విజ్ఞానపు రాశులం
శాసించే ధీరులం

అరుదైన పూదోటలం
ఆనందాల రాజులం
ఆపదలో ఆప్తులం
అమాయక అడ్రసులం

భరతమాత పుత్రులం
భారతమ్మ ఆస్తులం   
భవితవ్యపు శ్వాసలం
భావి భారతీయులం

దేశానికి ఎల్లలం
విశ్వంలో విజేతలం
జాతికి జవసత్వాలం
విశ్వ శాంతి కపోతాలం.

నగునూరి రాజన్న

No comments:

Post a Comment