నగునూరి రాజన్న
అంశం: శాంతిగీతం
తేదీ : 26 -11 -2018
శీర్షిక : సహజ మార్గం
సంఖ్య : 100
ఒకేతల్లి ఉదర సోదరులు
ఊకదంపుడు విషయాలకై
ఉనికి పోరాటాల ఉలిక్కిలో
శాంతిగీతమే కదా శ్రీరామరక్ష !
పచ్చగడ్డి భగ్గుమనే
ప్రచ్ఛన్న పరిస్థితుల్లో
ప్రభావాల పరిత్యజానికి
శాంతిగీతమే కదా సంధి మార్గం!
వత్సరాల పర్యంతం వడివడినా
వడి అడుగుల కలబడినా
చివరకు నిలిచి గెలిచేది
సమున్నత సౌధం శాంతిగీతమే!
ఇరుగైనా కోరు లాభం
పోరుగైనా పొందు క్షేమం
ఇరుగుపొరుగు ఇల్లు, దేశం ఏదైనా
శాంతిగీతమే కదా సహజ మార్గం !
నగునూరి రాజన్న
No comments:
Post a Comment