Saturday, February 9, 2019

అపోహలు

నగునూరి రాజన్న 
అంశం : అపోహలు 
తేదీ : 16 -11 -2018 
శీర్షిక : అశనిపాతపు ఆనవాళ్లు 

అనురాగాలు పెనవేసుకున్న 
అందమైన ప్రపంచాలలో 
అల్లుకునే అబద్దాల నీడన 
అల్లారు ముద్దుగా పెరిగే 
అదను చూసి కాటేసే చీడ .....

మమతల మాధుర్యాలు పంచే
మానసిక హృదయాంతరాలలో 
మధురమైన తేనె కుండలో
మట్టిపాలు చేయ బూనిన నీటి చుక్క...

అరమరికలు లేని 
ఆప్యాయతలు  పంచు 
అనురాగాల అమృత బాండములో
అగాధాలు సృష్టించే చీకటి పొడ....
 
ఆదమరిచి అడుగేస్తే 
అశనిపాతపు ఆనవాళ్ళై విస్తరిస్తుంది 
అంతులేని విషాదాలు నింపుతుంది
తస్మాత్...జాగ్రత్త ....
పారా హుషార్ .....

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment