అంశం : ప్రచార పర్వం
తేదీ : 05 - 12 - 2018
శీర్షిక : కీచక పర్వానికి పూర్వం
సంఖ్య: 94
పచ్చి పులుసుకైనా
పట్టు వస్త్రాలకైనా, పసిడి నగలకైనా
పబ్లిసిటీ ఉంటేనే......
ఊపు రావాలంటే
ఊదరగొట్టే ఊక దంపుడు
ఊసులెన్నో చెప్పాల్సిందే.......
తాత్కాలిక భృతులు మనకిస్తామంటూ
శాశ్వత సప్తవర్ణాల అధికార ఆస్తి పోగులకు గాలం....
ఐదు పది రోజులు అయ్యా అప్పా అంటూ
ఐదేండ్ల అంబారీ సేవలకు సమాయత్తం ....
మన పన్నులు మనకే ఇస్తూ
మస్తు పైసలు ఖర్చు చేస్తున్నామంటూ
మంది మార్బలాన్ని మడతబెట్టుకుని
అరుగులన్నీ ఎక్కి దిగుతూ
పొర్లు దండాలు పెట్టుకుంటూ
నక్క వినయాలు సక్కంగా పాటిస్తూ
కీచక పర్వానికి పూర్వపు ఘట్టమే
ప్రచార పర్వం మిత్రమా .........
సంఘమై నిలిచి -
సంక్షేమం చూస్తారనుకుంటే
తోటి వారనే సానుభూతి లేకుండా
తోడేళ్ళ వలె పీక్క తింటున్నారు
తొక్కి నార తీస్తున్నరు
అమాయకులను ఆగం చేస్తున్నారు .......
నగునూరి రాజన్న
తేదీ : 05 - 12 - 2018
శీర్షిక : కీచక పర్వానికి పూర్వం
సంఖ్య: 94
పచ్చి పులుసుకైనా
పట్టు వస్త్రాలకైనా, పసిడి నగలకైనా
పబ్లిసిటీ ఉంటేనే......
ఊపు రావాలంటే
ఊదరగొట్టే ఊక దంపుడు
ఊసులెన్నో చెప్పాల్సిందే.......
తాత్కాలిక భృతులు మనకిస్తామంటూ
శాశ్వత సప్తవర్ణాల అధికార ఆస్తి పోగులకు గాలం....
ఐదు పది రోజులు అయ్యా అప్పా అంటూ
ఐదేండ్ల అంబారీ సేవలకు సమాయత్తం ....
మన పన్నులు మనకే ఇస్తూ
మస్తు పైసలు ఖర్చు చేస్తున్నామంటూ
మంది మార్బలాన్ని మడతబెట్టుకుని
అరుగులన్నీ ఎక్కి దిగుతూ
పొర్లు దండాలు పెట్టుకుంటూ
నక్క వినయాలు సక్కంగా పాటిస్తూ
కీచక పర్వానికి పూర్వపు ఘట్టమే
ప్రచార పర్వం మిత్రమా .........
సంఘమై నిలిచి -
సంక్షేమం చూస్తారనుకుంటే
తోటి వారనే సానుభూతి లేకుండా
తోడేళ్ళ వలె పీక్క తింటున్నారు
తొక్కి నార తీస్తున్నరు
అమాయకులను ఆగం చేస్తున్నారు .......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment