Saturday, February 9, 2019

ఇరుగు పొరుగు

నగునూరి రాజన్న 
నేటి కవిత అంశం : ఇరుగు పొరుగు 
తేదీ : 15-11-2018
శీర్షిక : నిద్రలో మెలకువ 
సంఖ్య : 97 

ఇల్లు, చేను, దేశం ఏదైనా 
ఇరుగు పొరుగుతో మనం 
ఇష్టంగా కలిసి ఉంటే 
కష్టాల ఊసులు ఉండవు. 

ఇచ్చిపుచ్చుకుంటూంటేనే  
ఇనుమడించు నైతిక బలం 
వచ్చి పోతూంటేనే 
బలపడేను  బంధం. 

కాని కొన్నిసార్లు లెక్క తప్పుతుంది ...... 

శతాబ్దాల చరిత చూడు 
శరణాగతి పాలయ్యాం . 
అన్ని రకాల పాలకులతో 
అలుపు చెంది ఉన్నాం . 

కయ్యానికి ఎప్పుడు కాలు దువ్వలేదు 
కళ్ళలో కరుణ -కడుపులో కత్తులు 
కపట ప్రేమ చూపిస్తూ  కక్షగట్టి 
కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నరు 

ఇరుగు పొరుగు అని గౌరవిస్తుంటే 
ఇల్లు పీకి పందిరేద్దామంటున్నరు 
మంచి తనమని వల్లె వేస్తే 
ముంచుదామని చూస్తున్నరు.  

నిద్రలో కూడా మెలకువ పాటించాలి .. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment