Saturday, February 9, 2019

బినామీలు

నగునూరి రాజన్న
అంశం: బినామీలు
తేదీ 18 -12 -2018
శీర్షిక : అడ్డగోలు సంపాదనలు
సంఖ్య: 107

మాటలలో చాక చక్యం
మంత్ర ముగ్దుల్ని చేయగలిగే నైపుణ్యం
మతులు పోగొట్టే మాయల మరాఠీ తత్వం
మేక వన్నె పులి జాడలు ......

మానవత్వపు ఛాయలు కానరావు
మాలిన్యాల మతలబుల చిట్టా
మకుటం లేని మహారాజుల నీడలు
మనసు విష బీజాపు ఛాయలు....

ప్రజలకే తనువు అంకితమంటూ.....
ప్రజల సొమ్ముకు సేవకులమంటూ...
పాప పంకిలాల ఆలోచలు చేస్తూ....
పన్ను ప్రాధికారులకు టోపీలు వేస్తూ...

ఒంటికాలు కొంగజపాలు .....
జంట కరముల సంపాదనలు...
మింటినంటే ద్రవ్య రాసులు .....
చుట్టమయ్యే చట్టాల జాడలు  ....

అడ్డగోలు సంపాదనలు
అనతి కాలంలో అందలాలు
అచ్చెరువొందే ఆస్తుల వివరాలు
అంతు చిక్కని అడ్రసుల చిక్కుముడులు ....
ఆనవాయితీగ బినామీల నీడలు.....

నగునూరి రాజన్న

No comments:

Post a Comment