Saturday, February 9, 2019

బాల సాహిత్యం

నగునూరి రాజన్న 
నేటి కవితాంశం : బాల సాహిత్యం 
తేదీ 14-11-2018
శీర్షిక : మార్గ దర్శనము. 
సంఖ్య : 96

ముద్దులొలికే బాలలకు 
ముద్దబంతి పూవులకు 
ముదము పంచు పిల్లలకు 
ముందు తరం ప్రతినిధులకు 

బాల్యమనే బంజరు భూమిన
బాల సాహిత్య విత్తనాలతో 
బహు చక్కగా సేద్యం గావించ 
బహుళార్ధక ప్రాయోజితమే సుమా !

విద్యపైన మక్కువేర్పరచ 
విజ్ఞానంపై జిజ్ఞాస పెంచ 
మంచి చెడుల పొడ తరిచి 
మార్గమేర్పరచ విడమరిచి....  

జీవితాన కాచి వడబోసిన 
దేశ భక్తుల ఘన చరిత్ర 
గొప్ప గొప్ప నీతి సూత్రాల వల్లెవేత 
భావి భారత పౌరులుగ తీర్చు 

కీర్తి గడించిన దేశ భక్తుల గాథలు 
స్ఫూర్తి పొందు వీర చరితలతో 
జాతికి జవసత్వాలు నింపిన 
నీతిగా భావి తరం వర్ధిల్లు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment