నగునూరి రాజన్న
అంశం : సబ్సిడీలు
01 -12- 2018
శీర్షిక : తాత్కాలిక ఆసరా .......
సంఖ్య : 101
రాజుల రోజులు పోయి రాజ్యాలు మారినా....
రోజు కూలోళ్ళ బతుకుల్లో రోషిణీలు రాలేదు.
ప్రజాస్వామ్యం పేరుతో పాలనలు ప్రవేశపెట్టినా.....
ప్రజల బతుకుల్లో ఫలితాల జాడ కానరాదు.
దుడ్డు ఉన్నోడిదే దున్నపోతన్నట్టు
డబ్బున్నోడిదే అధికారమౌతున్నది.
దెబ్బదేండ్ల పాలన దెప్పి పొడిచినట్టు
సబ్సిడీల మంత్రమేసి సద్దుమణిగిస్తున్నరు.
చదివి జ్ఞానవంతులయితే....
తన్ని లెక్క పక్కాగా చూస్తరని...
తాగి తాగి జనాలనూగించి.....
తన్ని తన్ని పన్నులేస్తున్నరు.
సొంతంగా కాళ్ళ మీద
సోయి కలిగి నిలబడకుండా
సాగిలబడి మొక్కడానికి
సదా పానమున్నోడు కావాలని....
ఓట్లప్పుడు కాకి లెక్కలకు
ఓటున్న ప్రాణి కావాలని ....
చావకుండా లేవకుండా
ఓ చవట సన్నాసి కావాలని....
మన డబ్బులు మనకిస్తూనే
తమ డబ్బులు పంచినట్టు
స్వకుచ మర్దనానందపు
సంకుచిత జబ్బ చరుపులు....
తాత్కాలికంగా ఆసరా ఇచ్చి
శాశ్వతంగా తలెత్తుకు నిలిచే
పదులు ప్రజలకిచ్చి రాబందులు కోట్లు మింగని
అసలు సిసలైన సబ్సిడీలు కావాలి....
నగునూరి రాజన్న
అంశం : సబ్సిడీలు
01 -12- 2018
శీర్షిక : తాత్కాలిక ఆసరా .......
సంఖ్య : 101
రాజుల రోజులు పోయి రాజ్యాలు మారినా....
రోజు కూలోళ్ళ బతుకుల్లో రోషిణీలు రాలేదు.
ప్రజాస్వామ్యం పేరుతో పాలనలు ప్రవేశపెట్టినా.....
ప్రజల బతుకుల్లో ఫలితాల జాడ కానరాదు.
దుడ్డు ఉన్నోడిదే దున్నపోతన్నట్టు
డబ్బున్నోడిదే అధికారమౌతున్నది.
దెబ్బదేండ్ల పాలన దెప్పి పొడిచినట్టు
సబ్సిడీల మంత్రమేసి సద్దుమణిగిస్తున్నరు.
చదివి జ్ఞానవంతులయితే....
తన్ని లెక్క పక్కాగా చూస్తరని...
తాగి తాగి జనాలనూగించి.....
తన్ని తన్ని పన్నులేస్తున్నరు.
సొంతంగా కాళ్ళ మీద
సోయి కలిగి నిలబడకుండా
సాగిలబడి మొక్కడానికి
సదా పానమున్నోడు కావాలని....
ఓట్లప్పుడు కాకి లెక్కలకు
ఓటున్న ప్రాణి కావాలని ....
చావకుండా లేవకుండా
ఓ చవట సన్నాసి కావాలని....
మన డబ్బులు మనకిస్తూనే
తమ డబ్బులు పంచినట్టు
స్వకుచ మర్దనానందపు
సంకుచిత జబ్బ చరుపులు....
తాత్కాలికంగా ఆసరా ఇచ్చి
శాశ్వతంగా తలెత్తుకు నిలిచే
పదులు ప్రజలకిచ్చి రాబందులు కోట్లు మింగని
అసలు సిసలైన సబ్సిడీలు కావాలి....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment