చిత్ర కవిత
తేది : 12-11-2021
శీర్షిక : నాట్య భంగిమ
కవిత సంఖ్య : 69+5
ఏమని వర్ణించగలము ....
ఎద మీటిన గోడమీది చిత్రం
చిత్త్రములో చిత్రంగా మలిచిన
ఏకరీతి వస్త్రధారణలతో
ఎగిరినిలిచిన జంటగా ...
భ్రమింప జేయగ బయటకు
దూకుతున్న విధముగా.....
జగమెరిగిన సత్యమేగా
జానపదపు కట్టూ బొట్టూ
నాట్యమేదయినా ... నటనా
కౌశలమే....పట్టు భంగిమలకు ....
ఆనందాలకు పుట్టినిల్లయినా
ఆరోగ్యాలకు మూలసూత్రం
కూచిపూడి భరతనాట్యం ఏదైనా ...
అదేకదా అందం మన భారతాన .....
గాలిలో తేలినట్టున్నా
గడసరి జంట నృత్యం
గమకాలకు ... గతులు
నేర్పి ....జతులు కలిపేది ....
అర క్షణం అజాగ్రత్తయినా
పడిన శ్రమంతా బూడిదలో
పోసిన పన్నీరే ....పూర్వాభ్యాసమే
పునీతం చేస్తుంది .... పూర్ణత్వం నింపుతుంది ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment