జాతి సమైక్యత
తేది : 19-11-2021
శీర్షిక : ఇప్పుడిక ఓటర్ల బాధ్యత
కవిత సంఖ్య : 799
వందలేళ్ళ చరిత తరిచి చూడు
స్వచ్ఛమైన స్వేచ్చే మన ఊపిరి
పరమత భేదమెరుగని తత్వమే ...
భిన్నత్వమైనా ... ఏకత్వమే శ్వాస ...
మేకతోలు కప్పుకున్న పులులే
మందలో కలిసి...మంటలు రాని
పోగలతో మాటేసి ... మాట మాట
రాజేసి ... లౌకికత్వాల ముసుగులు
వేసుకుని...
ఆర్ధిక నేరాల అభియోగాల పక్షులన్నీ
కలిసి .... ఆరోన్నొక్క రాగాలు తీస్తూ
అధికార పీఠాల అంగడి బేరాలలో ....
పైశాచికత్వాలు ప్రదర్శిస్తున్నా యి ....
సమున్నతమైన సమైక్యత కోటకు
బీటలు వారగొడుతున్నారు .....
పల్లెల్లోని సకలజనుల సమూహాలకు
విద్యలందకుండా వైద్యమందకుండా
ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు పడుతూనే ...
కొన్ని సంచార జాతులను నేటికీ గాలికి
వదిలేసారు .....
చేయవల్సిన సేవలన్నీ చేయకుండా....
చేయకూడని లెక్కలన్నీ చేసేసుకుని
అధికార పక్షాల కోటరీల నీడల గోడలలో
ప్రతి పక్షాలు సైతం ముల్లెల మూటలు
సర్దేసుకునే బృహత్ కార్యంలో మునిగారు ....
వీలైనన్ని కులాలు మతాల బూచీలు
చూపుతూ అందులో అంతర్భాగాల
పంపకాల వంకలు చూపిస్తూ ... ఓటర్లంతా
ఎప్పటికీ ఒక్కటి కాకుండా ఎప్పటికప్పుడు
తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ....
సంధి సమయములో.. కూడలిలో
నిలబడ్డ సాధారణ మనుషులపైననే
ఓటర్లపైననే .... జాతి భారమంతా ఇక ఇప్పుడు...
సమైక్యతను కాముక నిలపాల్సిన బాధ్యత .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment