చిత్ర కవిత
తేది: 20-11-2021
శీర్షిక : బోన్సాయి జీవితాలు
కవిత సంఖ్య : 69+10
పచ్చ పచ్చని తివాచీలతో
పరువాల వనసంపదలతో
మరకతమై శోభలందించే
మహీతలము ఒకనాడు ....
తరువు నీడలోనే జీవరాశి
తనువు వెళ్లదీసుకునే...
ప్రాణవాయువులీయగా
పాశుపతాస్త్రమే మనందరికీ .....
సకాల వర్షాలకు సహి యోగిగా
తాగునీటికి ... సాగునీటికి
తాను పరోక్షమై ...తిండీ తిప్పళ్లకు ..
గూడు నీడలకు కూడా తోడాయే .....
తాగి తల గొరిగించుకుని
మునిమాపు లేచి ముడుచుకో
జూసినట్టు .... స్వార్థ చింతనల
సరంగైన మానవాళి ఆకాశాన్నంటే
ఆపన్న వృక్షాలను తెగనరికి ....
బోన్సాయి కుండీల నీడల్లో
బొట్టు బొట్టు నీరందించుకుంటూ
బోనాలు పెట్టుకున్నంత మాత్రాన
తెల్లారెనా.. తెచ్చి పెట్టుకున్న
బతుకు చిత్రం ....
ఎంపెల్లి చెట్టుకు నిచ్చెనేసే
మనుషులు రాబోతున్నట్టు...
బ్రాకోలి వృక్షంగా తలిచినంత
మాత్రాన తండ్లాటా తీరేనా .....
సత్శీలతలతో తప్పు తెల్సుకుని
సకాలంలో సర్దుకోకపోతే
మానవాళి మాత్రమే కాదు
సమస్త జీవరాశి ఉనికికే ముప్పు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment