మంచి మనసు
తేది : 17-11-2021
శీర్షిక : కొంత మంది నీతి
నియమాల చేయూత .... .
కవిత సంఖ్య : 188
శిశిరంలో పాత ఆకులను
రాల్చుకుని ... వసంతములో
కొంగ్రొత్త చివుళ్ళతో పచ్చదనాలను
పొదువుకుని ... కాల గమనంలో
తిరుగుతూ మార్చుకునే కొలమానమే
విభిన్న యుగాలు ....
ధర్మ పాదాలు కుంచించుకుని
ఒంటి స్తంభంలా నిలబడి
ఒంటరి పోరాటం చేస్తూ ...
ఎన్నో ధర్మ సంకటాలను
ఎదిరిస్తున్నదంటే ......
దాన ధర్మాలు ఒక వంతుతోనే
దండిగా గాండ్రిస్తున్న దానవులై
నర్తించే మానవ ముష్కరుల
దగా మోసముల అడ్డుకుంటున్నదంటే ....
విశ్వమంతా విచ్చలవిడిగా
నిత్యం ఎదో ఒక మూల
పెచ్చరిల్లుతున్న భీభత్సాలను
ఖచ్చితంగా నిలువరిస్తున్నదంటే ....
అక్కడక్కడా న్యాయ ఫలాలు
అందుబాటవుతున్నాయంటే
అరకొర సమన్యాయ సుమాలు
పరిమళాలు వెదజల్లుతున్నాయంటే ...
ఇంకా కొంత మందైనా కోరి
పాటిస్తున్న నీతి నియమాలే ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment