ప్రత్యేక కవిత
12-11-2021
కవిత సంఖ్య : 187
శంభుని మాసం శరదృతువు
చలి తలపుల కబుర్ల కాలం
గిలి చేరికల ఆహ్వానాలు
మనసునకెంతో మనోల్లాసం ....
పితృ అమావాస్య నుండే
పెసర గింజంతతో మొదలై
వటుడింతై ఇంతింతై లాగ
పైలాయించుతుంది చలిపులి ....
మా బామ్మ బోధనల్లా దినకరుడు
చలి కాలములో బాలకుడై
ఎండాకాలంలో యువకుడై
వర్షాకాలంలో వార్ధక్యములా ….
కాలగమనాలకు కదిలే తరంగం
కాకుండా అప్పుడప్పుడు
ఉద్యోగులకిచ్చే బోనస్సులా
హిమగిరి పంపించే ప్రత్యేక
కానుకలు కూడా పలుకరించి
పోతుంటాయి దేశప్రజలను ....
చల్లగాలి మాటల పలుకరింపులకే
గిలిగింతల కూనిరాగాలతో వేడి
వేడి తేనీటి సమావేశాలు...పకోడిల
పదనిసలు... మొక్కజొన్న పొత్తుల
చిటపటలలో దొరికే భలే భలే పసందే
మానసానికి … ఒడువని ముచ్చట్లే…
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment