మనసే కోవెల
తేది : 17-11-2021
శీర్షిక : శాంతి పూల వనం ...
కవిత సంఖ్య : 69+8
జీవరాశిలో మేమె మిన్నంటూ
మాటలు కోటలు దాటించడం
కాకుండా ... చేతల తోటలలో
మమతలు పండించి మల్లెలు
పూయించి ... అనురాగ దీపాలను
వెలిగించినప్పుడే కదా .....
స్వార్థాలను సమాధి చేసుకుని
పొరుగు క్షేమాలను పొందుగా
కోరుకునే ఆత్మీయ లతలను
అల్లుకుని కుసుమ పరిమళాలను
వెదజల్లినప్పుడే కదా .....
ఈర్ష్యా ద్వేషాల గోడలను
బద్దలు కొట్టుకుని... సమతా
మమతల సంస్కారాలను
మూటగట్టుకుని... సాటి వారిని
ప్రేమించగలిగితేనే కదా ...
ప్రతి మనిషి మనసు ఓ కోవెల
దీపమై వెలుగులు ప్రసరించేది...
విశ్వమంతా విరుల పరిమళాలు
వెదజల్లేది.... శాంతి పూల వనమయ్యేది ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment