సహన సౌశీల్యత
తేది : 16-11-2021
శీర్షిక : అవని మాత
కవిత సంఖ్య : 796
తరులు గిరులు మోసుకుని
తనువును ఒకపక్క దుక్కి దున్నినా
అంకురాలకు తాను జన్మనిస్తూనే
అశేష జీవరాశికి అన్నదాతగా నిలిచె ....
పంచభూతాలను పదిలపరుచుకుని
పరుగులిడుతూనే ...ప్రాణులను
పలకరిస్తూ... పరవశిస్తూ...మురిసిపోతూ ...
డస్సిపోతూ...సమాయత్తమవుతూనే ఉంది ....
స్వార్థాలను చంకనేసుకున్న మనిషి
అవసరాలకు కొంత ... అందలాలకు చాలా
అడుగెల్ల పొర్లించి అపహరించుచుండె
అనేక విధాలయిన ఖనిజ సంపదలు ....
కాలుష్యపు కోరలతో మనుషులెంత
రక్కినా ...కరుణ గల్ల మాతగా తానెప్పుడూ
మరకతమై శోభిస్తూ కలిగినదంతా
ధారపోస్తూ అమ్మగా మనల్ని కనిపెట్టుకునే
ఉంటుంది ....
జనసాంద్రత పదింతలై ... యంత్ర సాంద్రత
మరింతైనా ....నిరంతర గమన శీలతతో
నీరసించకుండా .... తనువంతా తపోవనం
చేసి.... జీవరాశికి మూలాధారమైనది...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment