చిత్ర కవిత
తేది: 18-11-2021
శీర్షిక : ప్రేమ తత్వం ....
కవిత సంఖ్య : 189
పేరుకు రెండే.. అక్షరాలైనా
రెండు హృదయాల శబ్దలయ
సమయం సందర్భం చెప్పదు
పుట్టుకకు ఏ మూలమెరుగదు ....
ప్రేమంటేనే కుసుమ కోమలం
పూలల్లో రాణివాసం పొందిన
పుణ్యప్రదమైన గులాబీ చిహ్నమై
గుబాళిస్తుంది ప్రతి ప్రేమజంటకు .....
చూపుల్లో మోసుకొచ్చే సమ్మోహనం
తలపుల్లో నింపి పెట్టే వసంతం
మాటల్లో మునిగిపోయే పరవశం
స్పర్శలో తేలిపోయే తన్మయత్వం .....
గమనంలో కానరాని కష్టాలు
కదలికలో చూడలేని నష్టాలు
గుచ్చుకున్నా ఎరగలేని కంటకాలు
గగనమైనా చేరగల నమ్మక గమ్యం .....
దూరమైనా ప్రియులకు ...
కౌగిలిలో ఒదిగిన క్షణాలలో
కుసుమ కోమల స్పర్శలైనా
గుచ్చుకున్న కంటకాల బాధలయినా
ఒక్కటేనన్న తత్వమే ఈ చిత్రం .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment