శీర్షిక: జగతికి మూలం
జలమేరా ఈ జగతికి మూలం
జలం విలువ తెలిసికొనుట మానవ ధర్మం
మూడింట రొండొంతుల జలమేరా విశ్వమందు
ముచ్చటగా రెండవ ఆవశ్యం మానవ జీవనాన
సద్వినియోగం చేసుకుంటేనే మనుగడరా
సేద్యానికి, జీవనానికి యోగము జలము
ఇనుమడింపు భూగర్భ జలాలను నిశ్చయమ్ముగా
ఇంకుడు గుంతలు, కందకాలు,కాంట్లూరు,రాళ్ళ కట్టలతో
కుంటలు, చెరువులు పూడికలు తీయించురా
నిండు కుండలోలె సదా నీటితో నింపరా
జలమేరా ఈ జగతికి మూలం
జలం విలువ తెలిసికొనుట మానవ ధర్మం
Nagunuri Rajanna Presnetly at RICHMOND,USA
Retd.Dy.Mgr(F)
NTPC Rdm
NTPC Rdm
Karimnagar
19.05.18
No comments:
Post a Comment