Tuesday, May 29, 2018

బాపూజీ బ్రతికించవా..... మరొక్కసారి

బాపూజీ బ్రతికించవా..... మరొక్కసారి

బాపూజీ బ్రతికించవా భరత మాతను మరొక్కసారి 
జాతిపితవై  ఆలకించవా జనుల గోసను ఇంకొక్కసారి

విలువలు తెలియని కొంత మంది పాలకులతో విసిగిన ప్రజలు  
విచక్షణ లేని కొంత మంది అధికారులతో  విరక్తి నిండిన జనులు 
అవినీతి, బంధుప్రీతి,లంచగొండి తనాలతో  అట్టుడికి
అధః పాతాళానికి అంచున ఉన్నది విశ్వ వేదికలలో 

ఏండ్లకు ఏండ్లు గడుస్తున్నయి  స్వాతంత్య్రం వచ్చి  
ఎగుడు దిగుడు లేదు సాధారణ ప్రజా జీవితాన   
ఎనభై శాతమున్న కర్షక,కార్మిక,జవాన్ల జీవితాన 
ఎలుగులు నిండుగా రాలేదు ఈనాటికి  

పనికొచ్చే విషయాలతో పాఠ్యఅంశాలుండవు 
పట్టు బట్టి ప్రజా అక్షరాస్యతను పతనం కావించారు 
గుడిని తలపించాల్సిన సర్కారు బడులన్నీ    
గుదిబండలుగా భారమై మారిపోతున్నాయి 

వినువీధులలో  ఫరిడవిల్లిన విశ్వవిద్యాలయాలు 
వింత వింత కారణాలతో కనుమరుగై  పోతున్నయి 
ప్రజారోగ్యాలకై వెలసిన ఆరోగ్యాలయాలేమో
పక్షవాతమొచ్చినట్టు పడకేసి పరిహాసిస్తున్నయి 

ప్రభుత్వాలు  మాత్రం సన్నాయి నొక్కులతో 
పన్నులు వేయడం,పద్దులు కేటాయించడం ఆనవాయితీ, 
ప్రజల బాగోగులు పట్టించుకోని పాలకులకు
ప్రవేటు అవుతుంది అక్షయపాత్రలు కొంత

విశ్వానికి విలువల మార్గాలు నేర్పిన దేశానికి 
విలువలేని జడపదార్థ మార్గం ముంచుకొస్తున్నది 
బాపూజీ బ్రతికించవా భరత మాతను మరొక్కసారి 
జాతిపితవై  ఆలకించవా జనుల గోసను ఇంకోసారి 

No comments:

Post a Comment