Thursday, May 10, 2018

మే డే 2018



రాజుల రోజులు పోయి రాజ్యాలు మారినా 
రోజు కూలి బతుకులు మారలేదు 
ప్రజాస్వామ్యం పేరు చెప్పి పాలనలు వచ్చినా 
పేదవాడి బ్రతుకు చిత్రం మారలేదు 

మేడే పేరు చెప్పి పెద్దోళ్లంతా సందడి చేస్తే 
శ్రామికునికేమైనా సంతోషం దొరుకుతుందా?
దగాకోరు దలారీ తనం ఉన్నంత వరకు 
నిఖార్సయిన ప్రతిఫలం చేరుతుందా కాలే కడుపుకు?

స్వార్థ రాజకీయాలు,దళారీ వ్యవస్థ  మారితే , 
లంచగొండి అధికార హయాములు మారితే ,
కళ్ళ గంతలు తీసి న్యాయాన్ని సమం చేస్తే 
కనవచ్చును అసలు సిసలైన మేడే పండగ అందరి ఇంట 

No comments:

Post a Comment