Thursday, May 10, 2018

తరం మారింది


తరం మారింది తలపులు మారుతున్నాయి 
మనమూ మారాలి వారి దారిలోకి 

అమ్మా, నాన్న, గురువుల మాటలకన్నా 
గూగులమ్మ మాట మీద గురి కుదిరింది 

అన్నా దమ్ములు అక్కా చెల్లెళ్ళ కన్నా 
ఆండ్రాయిడ్ ఫోన్లమీద మక్కువ పెరిగింది 

బంధువులు, మిత్రులు,శ్రేయోభిలాషులకన్నా 
బంధమెక్కువైంది నెట్టింట్లో 

ప్రేమలు, పెన్నిధులు,అనురాగాల కన్నా 
ఫేస్ బుక్కులో వచ్చే లైకులంటే మక్కువ 

ఇరుగు పొరుగు వారి కన్నా 
ఇన్ స్టాగ్రామ్  పోస్టింగ్ లంటేనే  ప్రీతికరం 

ఎదుటి వారి గొప్పేంటి, ఎవరైతే నాకేంటి, 
నేనే రాజు , నేనే మంత్రి అనే రకం 

విజ్ఞాన సూచీలు అమాంతం మారిపోతున్నయి 
విశ్వవేదికలే హద్దులుగా విరబూయిస్తున్నారు 

ఇష్టమైన చదువులు/ఉద్యోగములు  ఎన్నుకుంటున్నారు 
కష్టములే తెలియకుండా పెరుగుతున్నరు 

ఆదాయాలకు మాత్రమే ప్రాధాన్యమంటారు 
విలువల వలలో చిక్కనంటారు 

ప్రతి చిన్న విజయానికి పొంగి పోతారు 
పక్క వాళ్ళ మెప్పులు  పొందాలనుకుంటారు 

పరుగులెత్తి  ప్రకంపనలు సృష్టిస్తున్న తరం 
పొదుపు ముందు తదుపరే ఖర్చు అంటున్న తరం 

పారిశ్రామిక విప్లవ కాలములోని  "మనం "
సాంకేతిక విప్లవంతో "నేను " గా మారిన తరం 

శాస్త్ర సాంకేతికత శకంలో పుట్టిన తరం 
విశ్వ సంస్కృతిని పట్టుకున్న తరం 
తక్షణ విజయాలను చవి చూడాలనే తరం 
తమ శక్తేమిటో నిరూపించుకుంటున్న తరం 

సామాజిక మాధ్యమాలల్లో సందడి చేస్తున్న తరం 
సంస్కృతి మార్చి, సాంప్రదాయములో మైలు రాయి నిలిపే తరం 

మిలీనియల్స్, స్క్రీనేజర్స్ , నెటిజన్స్ గా పేరొందిన తరం.
08-05-18

No comments:

Post a Comment