Tuesday, May 29, 2018

పెళ్లిళ్లు-సందళ్ళు-గోల


పండంటి జీవితాల పడుచుల జోడు కోసం 
పదహారు రోజుల ఉత్సవాలను  
పంచాంగ ముహుర్తములు పాటించుతూ 
పండగల లాగ నిర్వహించె ఆనాడు 

తదనంతరం ఐదు రోజులకు కుదించి 
తనువు బంధు బలగాల మధ్య 
తనివి దీర తమ ఉత్సవములు నెరిపి 
తాదాత్మ్యం పొందిరి మన తాతల కాలములో 

సంధి కాలముల సౌకర్యముగా ఎన్నుకుని 
చల్ల వాతావరణాల ఉల్ల సంతసమంద 
చైత్ర,వైశాఖ ,కార్తీక మరియు మాఘ మాసముల 
అతిథులందరికీ తగు ఆహ్లాదములు పంచ 

దగ్గరి బంధువులు , మిత్రులు సైతం 
దన్నుగా నిలిచి సాయమందించెను నాడు 
ధగ దగలు మెరువంగ నిగ నిగలు కురువంగ 
దర్పములు పెంచి సందళ్ళు-గోల అంటు
దండి ఖర్చులకు దిగుతున్నరు ఈనాడు 

వచ్చె పొయ్యెడి  బంధు మిత్రులకు వరుస బెట్టి 
వంట,వార్పులు, వసతులు రోజులెల్ల చేయలేక 
వాటముగా ముహుర్తములను సరిచేసుకుంటూ 
అభిజిత్ లను అలవోకగా ఆచరిస్తున్నారు

స్వామి కార్యములను సాకుగా చూపిస్తూ 
ఆచార వ్యవహార అవకాశములను 
అందిపుచ్చుకుని సంధి చేసుకుని 
సౌలభ్యముగా తమ తమ స్వకార్యములను 
సవరించుకొనుచుండిరి సావకాశముగ  ఈనాడు .

No comments:

Post a Comment