SK 624
నగునూరి రాజన్న
శీర్షిక: తీపి జ్ఞాపకాలు
తనువు శాశ్వతం కాదని తెలిసినా....
తపన మానదు తన వారి గురించి ఆత్మ ... అయినా
తప్పదు పోరాటం జీవిత చక్రములో
పరమ పదము ప్రకృతి ధర్మమని తెలిసినా.....
పడి లేచే కెరటం లా పరితపిస్తుంది జీవి ... అయినా
ప్రయత్నించి అడుగులేస్తాం జీవన యానంలో
మరణం ఎప్పటికైనా తప్పదని తెలిసినా...
మననం చేసుకుంటూంది మనసు.... పదే పదే
మనవాళ్ళ తీయని జ్ఞాపకాల దొంతరలను
అనంతమైన తీయని బాధా భరిత ఆలోచనలకు
ఆ క్రందనలతో ఆవిష్కరించుకుని, భాధలు పంచుకుంటేనే
ఆర్తి తీరుతుంది, మనుసు కుదుటపడుతుంది
మరుపు మానవ సహజం
కాలం గాయాలను మాన్పుతుంది
ఉన్నవాళ్లు పోయినోళ్ల తీపి గురుతులు ....
Nagunuri Rajanna Presnetly at RICHMOND,USA
Retd.Dy.Mgr(F)
NTPC Rdm
NTPC Rdm
Karimnagar
No comments:
Post a Comment