కన్నడ కమామీషు
కన్నడ కంఠీరవాలన్నీ కఠిన చీకట్లలో
కలుగులో దాక్కున్న కరిముఖుని వాహనం తీరు
కన్న పిల్లల్ని కాపాడుకున్న మార్జాలం వైనమోలే
కడుపులో కలియబెట్టి కెలికి తిప్పినట్టు .... కలగదా సామాన్యులకు సైతం
ఉద్దండ నాయకులై ఉండి కూడా బేర సారాలతో
ఉచ్చ రాజకీయములు పాటించిన మీ తీరు
ఉసి గోల్పదా ముందు ముందు అధికారులకు
ఉసురు తీయ ప్రజలను మీ పాలనలో
రొచ్చుగుంట రాజకీయమంటేనే అనే సంస్కృతి
రోజుకో మలుపు తిరిగిన కన్నడ ప్రతినిధుల కమామీషు చూస్తే
రాజుల రోజులే మా బాగు మా బాగు అని
బూజు పట్టిన విధానాలే మహా మేలు అనుకోవాలేమో
వాళ్లంటే వీళ్ళనీ, వీళ్లంటే వాళ్ళని
ఎన్నాళ్లీ ఊకదంపు కబుర్లు .......
న్యాయ వ్యవస్థ కూడా కలి నడకలకు దాసోహం అయితే
నలుగురు మెచ్చే ప్రజాస్వామ్యానికి దిక్కేది... దారేది ?
రాజ్యాంగాన్ని తిరగ రాయండి........... మీ దమ్ము చూపండి
చట్టాలను మరింత సాన బెట్టండి ...ధైర్యం తో అడుగేయండి
స్వార్థాన్ని కొంత వదలండి.........కానీ మానవతను మరువకండి
నాగరికత తిరోగమనానికి బాటలు వేయకండి... చరిత్ర హీనులుగా మిగిలిపోకండి.

No comments:
Post a Comment