శీర్షిక: కొరివి దయ్యముర బాబూ
కోవిద్ నైంటీన్ అంటే
కొరివి దయ్యముర బాబూ ...//2//
కోహినూర్ వజ్రం కాదూ
నువు కలబడి కొట్లాడా ....
కోవిద్ నైంటీన్ అంటే
కిరీటమున్న ముళ్లపందిరా
కొబ్బరి దొరికిన కోతిరా
దెబ్బలు తిన్న పులిరా
విశ్వమంతా గెంతుతున్నది... //కోవిద్//
జడలు విరబోసుకున్న శివసత్తిరా
జలుబులు దండిగా తెస్తుంది
జబర్దస్తిగా... వెళ్ళావో
జ్వరాన్ని కూడా ఇస్తుంది.... //కోవిద్//
ఊహను దయ్యంర బాబూ
ఊహకు అందుత లేదూ
ఉట్టి పుణ్యాలకే అది
ఊపిర్లు బిగ పడ్తున్నదీ. // కోవిద్//
కొంటె పనులనే చేస్తున్నది
కోట్లమందిని బలి కోరుతున్నది
కొంచం ఓపిక పట్టర బాబూ
కొరెంటైన్ అయిపోరాదు. // కోవిద్//
కోట్ల ఎకానమీనీ సైతం
కొండెక్కిచ్చే కదర బాబూ
కోడిని ఎరగా వేద్దామా
కల్లు శాఖనే పొద్దామా // కోవిద్//
జర నువు సైసుర బిడ్డా
గలుమ దాటి రాకూ
దాని అడ్డా గనిపెడ్దామూ
గట్టిగ నడ్డి విరగ్గొడదాం... //కోవిద్//
కోవిద్ నైంటీన్ అంటే
కొరివి దయ్యముర బాబూ .....
నగునూరి రాజన్న
కరీంనగరు.
No comments:
Post a Comment