ధరిత్రి దినోత్సవ ప్రత్యేక కవిత
22-04-2020
పంచభూతముల పహారలో
ఫరిడవిల్లిన ధరిత్రి మాత
పచ్చ బొట్టే ..పాలపుంతలో ఒకప్పుడు .....
ఒరిపిడి రాజేతతో ఎరుపెక్కుతున్ నది
పైన లోన.. రెంటికి చెడ్డ రేవడిలా....
ఏబదేండ్లయింది ఎన్నుకుని విశ్వం
ఈ రోజు మన భూమాతకు సాంతమని....
ఎక్కడేసిన గొంగళి అక్కడే అయిపాయె
ఏ మాత్రం మార్పు సాధించలేకపాయె....
ఓజోను పొరను ఎర జూపుతూ
పచ్చ పన్నంటూ జనాల ముక్కు పిండుతున్నరు
ప్రభుత్వాల మొక్కుబడి
గుత్తేదార్లతో పెట్టుబడి
పత్తా లేని చెట్లు పచ్చదనాలు... పౌద రక్షణలు.....
కోట్లల్లో జనాభాలు కోరి పెరుగుతుంటే
పదుల్లో మాత్రమే ప్రజలు ముందుకొచ్చి
నిఖార్సయిన నియతి మొక్కల పెంపకంలో
దరిపల్లి రామయ్య పుణ్య దంపతుల్లా.... ఎలా ?
గూగులమ్మకు పచ్చ బొమ్మేస్తే
గుండె నిమ్మలమైతదా.......
చెట్లు దండిగా పెట్టాలి
పచ్చదనంగా పెరగాలి
ఓజోను నిండి మనమంత సల్లగుండాలి...
నగునూరి రాజన్న
హైదరాబాదు.
No comments:
Post a Comment