నీ ధ్యాసలో
తేది: 27-04-2020
శీర్షిక : బంగారు ప్రకృతి...
సంఖ్య : 404
బాల్య మస్తకములోని
బంగారు పుటలు తిరగేస్తే
పదిలపరుచుకున్న ఆనవాళ్లు
అక్షరాల దొంతరలు ... ఆనాటి ధ్యాసలు
పచ్చ తివాచీలు పరుచుకున్న
నెచ్చెలి సుందర మైదానాలు...
వాలు గాలికి వంగి వంగి
వయ్యారాలు పొయ్యే వటవృక్షాలు ....
ప్రకృతి పరమైన ఎత్తుపల్లాలు
తరగని చెరగని వన్నెలద్దుతూ
తమకు తామే ఏర్పరుచుకున్న
ఎత్తైన సుందర ఆరావళులు .....
మచ్చుకైనా కల్మషమెరుగని
మబ్బు నీరు బోలు మంచి సెలయేళ్ళు
నిర్మలమైన నీరజ తటాకాలు
పరిమళ భరిత ఓషద నిధులు....
మచ్చుకైనా కానరాక
మరులు గొన్న నా మనసున
పరి పరి విధాల పదే పదే
నీ ధ్యాసలో .... సేద దీరుతున్నా...
నగునూరి రాజన్న
హైదరాబాదు.
No comments:
Post a Comment