నగునూరి రాజన్న
కరోనా వైద్యులు
తేదీ 06-05-2020
శీర్షిక : వైద్యానికి వెలుగులు
సంఖ్య : 411
మనిషికి రోగమొస్తే ...
రోగం నొప్పీ లేని మనిషిగా
ఆలు బిడ్డలను అమ్మానాన్నలను
అన్నీ వదులుకున్న ఆపద్భాంధవులు
వైద్యులు....
కునుకు
కరువుయిన రోగులకు ....
కంటి పాపాలై కాచుకునే
అపర నారాయణులైన వైద్యులు
ఆసుపత్రి ప్రాంగణాలే
అల వైకుంఠపురమైన చందం .....
కనికరం లేని కరోనా సోకితే
ఇంటిల్లిపాదికి కంటి ముందు నరకం ...
వందల రోగుల మధ్య వదలని
ధన్వంతరీ వారసుల సేవలకు
వారి ఇంటిల్లిపాదికి అనుక్షణం బిక్కు బిక్కు ...
అంటురోగంతో రోగులు
తంటాలు పడుతుంటే.....
అన్న పానీయాలు వాళ్ళే ఇచ్చి
అన్నీ అమర్చి అమ్మానాన్నలైనారు ....
నాణానికి మరోవైపు:
దద్దరిల్లే కాలుష్యాల
దశాబ్దాల ధరణీ ఘోషను
ఒక్క లాక్ డౌన్ తీర్చింది.
నగునూరి రాజన్న
హైదరాబాదు
No comments:
Post a Comment