విద్యుల్లత (మెరుపు తీగ)
తేది : 24-04-2020
శీర్షిక : మహిమాన్విత
సంఖ్య : 402
చీకటి వెంటే వెలుగులా
చిరుదీపపు కాంతియై
నిలిచిన జ్యోతిలా ....
నల్ల బంగారంనుండే కదా
వెలుగులీనే కాంతుల
విద్యుల్లత రూపం....
మన నిత్య జీవితాన ప్రాధామ్యం.
అవును ! ఒక్క మెరుపుతీగ వెలుగులో
వినీలాకాశంలో విస్తరించిన
చిమ్మ చీకట్లన్నీ విడిపోయినట్టే....
చెల్లా చెదురవును
మనసులో మెదిలే చింతలు చికాకులు
ఒక్క ఉదుటున జరిగే
మెరుపు ఆలోచనల సవ్వడితో......
విశ్వమంతా కరోనాతో
విషాదమైన విపరీత క్షణాన
మహత్తు ఏదైనా రక్షించాలని
మహిమాన్విత విద్యుల్లతగా
మానవ కళ్యాణానికై ఆశతో ....
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment