నగునూరి రాజన్న
అమ్మమ్మ
తేదీ - 04-02-2020
శీర్షిక - ఆనందాల వెల్లువ
సంఖ్య - 357
తనువు చీల్చి తరువై నిలిచి
ఆత్మీయతలు నింపి అమృతాలు పంచి
అనురాగాలు అందించిన
అమ్మ మూలాలే అమ్మమ్మవి....
ఎద హత్తుకుని పెంచుకున్న బిడ్డ
ఎద్దడుగు దూరం లోపలుండాలంటూ
పంతం పట్టి పక్కూరుకే ఇచ్చి
ప్రతిక్షణం కనిపెట్టుకున్నది ....
ఎవరో అర్జంటుగా రమ్మన్నట్టు
తాతగారు హడావుడిగా వెళ్ళిపోయినా.....
కూతురును ఐదుగురు కొడుకులను
అహర్నిశలు అక్కున చేర్చుకున్న ధీశాలి....
పక్కూరైనా పల్లె వాతావరణం కాబట్టి
ఇలా వచ్చే వారితో వాకబులు చేసుకుని
అలా వెళ్లేవారితో కబుర్లు పంపిస్తూ
అనుక్షణం కంటికి రెప్పలా కాచింది .....
ప్రతి పండగకు పబ్బానికి పయనమే
ఇల్లు ఇల్లంతా పిల్లా పాపలం మేమందరం ......
కాలానుగుణమైన కాయగూరలైనా
పసందైన పండు ఫలాలైనా దండి దండిగా ......
పాతికేండ్లు ప్రతిక్షణం తడిసి ముద్దైన
అమ్మమ్మ ఆత్మీయపు అనురాగాల జల్లు....
అనుకున్నదే తడవుగా అక్షరీకరించడంతో
అదృష్ట దేవత మరోసారి తలుపు తట్టి
ఆనందాల వెల్లువ కుమ్మరించినట్టుయింది.... .
నగునూరి రాజన్న
కరీంనగర్
thank you very much for your response. But small request can you please post me in english, as I cannot read urdu.
ReplyDelete