నగునూరి రాజన్న
చిరునవ్వుల సంతకం
తేదీ 28-01-2020
శీర్షిక - కన్నవారి కలలు
సంఖ్య - 349
పెద్దలిచ్చిన గంపెడు పేదరికం
నిలువెల్ల ఆవరించిన నిరక్షరాస్యత
ఆకలిని జయించలేని అష్టకష్టాల సావాసం
పూట పూటకు అలితేరే అమ్మానాన్నలు....
బితుకు బితుకుమనే బతుకులకు
కాలే కడుపులకు కన్నీళ్లే అన్నమవగా
భవిత తెలియని బాటసారిగా
భారాలను బాధ్యతతో మోసే మనుషులకు .....
అక్షరాస్యతే ఆరాద్యమైన పిల్ల పిడుగులకు
అనుక్షణం తోడు నీడై నిలిచే చదువుల
విలువలెరిగిన తల్లిదండ్రులు
కడుపు కట్టి పనికొచ్చిన పైసా పైస కూడబెట్టి
అన్నీ తామై అమర్చిన వైనం.......
కన్న వారి కలలన్నీ కనికరించి సాకారమవ్వగా
కట్టేలేరిన చోటే కలువలమ్మిన చందంగా
పిల్లలంతా ప్రయోజకులయి పూల వసంతాలు నింపగా
చెమ్మగిల్లిన అమ్మానాన్నల కళ్ళు గుండె తడితో
ఎదల నిండా చిరునవ్వుల సంతకాలు విరియవా ........
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment