నగునూరి రాజన్న
జాతి పిత
తేదీ - 30-01-2020
శీర్షిక - గాంధీజీ...
సంఖ్య - 351
వర్తకపు వంకతో అడుగిడె వక్రబుద్ధులు
పరిసరాలు పసిగట్టి పగబట్టే తెల్లోళ్ళు
పసిగుడ్డులను పడతులను సైతం చెర బట్టే
నీ రూప ఛాయతో నిలువరించినావే ....
పోరుబందరులోన పొందైన బాల్యం
పొందికైన మత గ్రంధాల ఆధ్యాత్మికత్వం
అవపోషణ పట్టి తీర్చి దిద్దుకున్న అద్భుత వ్యక్తిత్వం
అభిభాషణలను ఆచరించిన మూర్తిమత్వం
అమ్మ మాటలే అచంచల విశ్వాసం
ఆజన్మాంతం పాటించిన సూత్రం
దక్షిణాఫ్రికాయైనా దండి సత్యాగ్రహమైనా
నిండుగా పాటించిన నియమాల ఆనవాళ్లు ....
స్వదేశీని ఆదరించమని సందేశించి
సహాయ నిరాకరణతో సంకేతించి
సమాజ దురాచారాలను నిర్ద్వందంగా ఖండించి
అంటరాని తనం అధిగమించిన ఆత్మ దర్శకుడవే .....
సత్యం
ధర్మం
తోబుట్టువులవగా
అహింస నిరాహారదీక్షలే ఆయుధాలై
ఆసేతు హిమాచలం ఆక్రమించే గదా
అందర్ని కలుపుకున్న ఆనాటి స్వాతంత్య్రం....
తీవ్రవాదం తీరు నచ్చక
అతివాదం ఆనవాళ్లు ఒప్పక
మితవాదం మాత్రమే మూటగట్టుకున్న మూర్తిత్వం ...
అందుకే గాంధీజీ ప్రియమైన... మన జాతిపిత .....
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment