అంశం - పలుకే బంగారం
తేదీ - 03-05-2019
శీర్షిక - బోలో స్వతంత్ర భారత్ కీ జై .....
సంఖ్య -176
వందల ఏండ్ల బానిస బతుకుల నుండి
రక రకాల నిరసనలతో, అనేక రకాల
తిరుగుబాట్లతో వందల వేల మందిని
కోల్పోయి, చివరకు సత్యాగ్రహాలతో
నిరాహార దీక్షలతో పోరాడి పోరాడి
ఎదురించి సాధించుకున్న ప్రజాస్వామ్యం...
నోముకున్నోడి ఫలం
నోచుకున్నోడి వంతన్నట్టు ....
ఎందరెందరో మహానుభావులు
ఎదురొడ్డి పోరాడితే వచ్చిన
స్వాతంత్రం ...... పగ్గాలు మాత్రం
చివరాఖరుకు దేశం “తల” తాకట్టు
పెట్టి 72 రెండేండ్లు... కాదు కాదు.....
ఇంకెన్నాళ్లో ..... రావణకాష్టానికి
కారణభూతమయిన గొప్పోరి చేతిలో
పడినందుకు ......
పొట్టి శ్రీరాములుగారిని పోగొట్టుకుం టే
కానీ భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడలేదు ...... .
(అదే సరయిన సమయం లో
పలుకే బంగారం......చేసిన ఫలితం )
ఇక పేరులో గాంధీ తగిలించుకుని...
చేసిన మంచి పనులన్నీ చెడ్డగా తోచే విధంగా ....
అడుగడునా అవకతవకలతో ...
నమ్ముకున్నోల్లను అందలాలెక్కించి
తాను చెప్పిన కుందేటికి
మూడే కాళ్ళు అనే రకంగా........
అవసరానికి మించి “అత్యవసరాన్ని”
చాటించి.....
దేశ ప్రజలందరి దృష్టిలో చెడ్డదై....
వెలుగొందగా....... .
ఎన్నో మార్లు ... సార్ల పలుకులు....
పత్రికల పలుకులు.... బంగారమే ఆయె ).
ఇక 2009 నుండి 2014 మధ్య కాలం....
ప్రపంచము లోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం
పదవి మాత్రమే పేరుకు....
పెదవి విప్పని సరుకు......
మనందరికి మూల విరాట్టు
కోట్ల ప్రజాధనం కొల్లగొట్టబడినా...
నోట్ల గోల నాకెందుకులే.... అని
పలుకే బంగారమయిన
పెద్దమనిషితో ........
పలికితే బాగుండనుకున్న దేశ ప్రజలు....
బోలో స్వతంత్ర భారత్ కీ జై ..................
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )
No comments:
Post a Comment