నగునూరి రాజన్న
అంశం : కోరికలే గుర్రాలైతే
తేదీ : 08 -05 -2019
శీర్షిక - విచక్షణతో విజయం
సంఖ్య : 180
పంచ వన్నెల రామ చిలుకల్లా
పంచేంద్రియాల పలకరింపులు
మానవ మనో ఫలకంపై
రంగు రంగుల ప్రపంచాన్ని
ఆవిష్కరించే సందర్భాలలో
వ్యక్తిగత,ఆర్ధిక, సాంఘీక,నైతిక శీల
పరిధులు దాటే ఆలోచనలెన్నో....
కోరికలు గుర్రాలైనప్పుడు....
గుర్రం ఎంత వేగమైనా మచ్చిక
చేసుకుని స్వారీ చేయగలిగినవే...
ఎటొచ్చి చీటా లాంటివైతేనే ప్రమాదం....
వేగాన్ని జయించే క్రమంలో మానవుడు
అంతరిక్ష నౌకల్లో ఇతర గ్రహాలకే
పయనమౌతున్నాడు.....
ఉబ్బి తబ్బిబ్బవకుండా
అంకురమయ్యే మంచి చెడుల
లాభ నష్టాల బేరీజుల విజ్ఞతతో
ధర్మ న్యాయ బద్దమైన వాటికి
పటిష్టమైన ప్రణాళిక,
పరిపుష్టమైన దీక్ష దక్షతలతో
క్రమానుగత క్రమశిక్షణల అమలుతో
పరులను ఫణముగ పెట్టక
నేర్పుగ సాధించిన యొప్పును మెప్పును.
విచక్షణతో విజయం సాధించవచ్చును.
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం రిచ్మండ్ )
No comments:
Post a Comment