అంశం : అంతరంగం
25-09-2018
శీర్షిక : అనంత తరంగాల అంతరంగం
సంఖ్య :65
పాల సముద్రం లాంటి
మానవ మస్తిష్కంలో
అనంత తరంగాల సంగమం
అంతరంగం.
ప్రతిక్షణం పలు తరంగాల
ఉక్కిరి బిక్కిరి.
ప్రసవ వేదనతో ప్రయత్నిస్తూనే
ఉంటాయి.
అర్థవంతమై ఆవిష్కరింపబడాలని...
పురిటిలో పునీతమయ్యేవి ఎన్ని ?
గమనం తీసుకుని గమ్యం చేరేవి ఎన్ని ?
పుడమిపై పుట్టుక సాధించేవి ఎన్ని ?
పుట్టినా పరిపుష్టమై నిలిచేవి ఎన్ని ?
అంతరంగపు ఆలోచనలనలకు
ఆమూలం ఆహార నియమాలే మిత్రమా....
అంతరంగపు ఆలోచనా విధానాలే
ఆరోగ్యపు రహస్యాలు సుమా ...... .
అడుగడుగున కదిలించే ఆలోచనలు
అంతరంగాన్ని అతలాకుతలం చేస్తూ
అనేక రకాల కార్య రూపాలను
ఆవిష్కరింప చేసుకుని అమలుకై
ఆరాట పడుతూనే ఉంటాయి ..
ధన వర్తన ఆలోచనా పరంపరలు
గుణ సంపన్నమై గురుతరతను తట్టి
గుర్తింపు నిస్తాయి.
సాధనతో సాధించవచ్చు సంయమనం...
అనంత తరంగాల అంతరంగ సంద్రాన....
25-09-2018
శీర్షిక : అనంత తరంగాల అంతరంగం
సంఖ్య :65
పాల సముద్రం లాంటి
మానవ మస్తిష్కంలో
అనంత తరంగాల సంగమం
అంతరంగం.
ప్రతిక్షణం పలు తరంగాల
ఉక్కిరి బిక్కిరి.
ప్రసవ వేదనతో ప్రయత్నిస్తూనే
ఉంటాయి.
అర్థవంతమై ఆవిష్కరింపబడాలని...
పురిటిలో పునీతమయ్యేవి ఎన్ని ?
గమనం తీసుకుని గమ్యం చేరేవి ఎన్ని ?
పుడమిపై పుట్టుక సాధించేవి ఎన్ని ?
పుట్టినా పరిపుష్టమై నిలిచేవి ఎన్ని ?
అంతరంగపు ఆలోచనలనలకు
ఆమూలం ఆహార నియమాలే మిత్రమా....
అంతరంగపు ఆలోచనా విధానాలే
ఆరోగ్యపు రహస్యాలు సుమా ...... .
అడుగడుగున కదిలించే ఆలోచనలు
అంతరంగాన్ని అతలాకుతలం చేస్తూ
అనేక రకాల కార్య రూపాలను
ఆవిష్కరింప చేసుకుని అమలుకై
ఆరాట పడుతూనే ఉంటాయి ..
ధన వర్తన ఆలోచనా పరంపరలు
గుణ సంపన్నమై గురుతరతను తట్టి
గుర్తింపు నిస్తాయి.
సాధనతో సాధించవచ్చు సంయమనం...
అనంత తరంగాల అంతరంగ సంద్రాన....
No comments:
Post a Comment