అంశం : ప్రేమలు-కక్షలు
తేదీ : 29-09-2018
శీర్షిక : కక్షలు లేని ప్రేమ
సంఖ్య : 68
ప్రేమలు కక్షలు పరస్పర విరోధులు.
ప్రేమ దైవత్వం,మానవత్వం
విశాల భావాలుంటాయి.
ఎప్పుడూ త్యాగాన్ని కోరుకుంటుంది.
ప్రేమ ప్రేమనే పొందుతుంది.
అవును ! మితవాదపు ప్రేమ.... .
అమ్మగా అమృతాన్ని పంచుతుంది.
నాన్నగ లాలిత్యాన్ని నింపుతుంది.
గురువుగ మార్గదర్శకమౌతుంది.
పెన్నిధిగ జీవనాన తోడుంటుంది.
ఇరుగు పొరుగై కాపలా కాస్తుంది.
అవసరమనుకున్నప్పుడు అనితర త్యాగం చేస్తుంది.
అతి వాద ప్రేమైతేనే అనర్థాలు..... .
తిరస్కరిస్తే కక్ష కడుతుంది.
కన్ను మిన్ను కానదు.
కడతేర్చాలన్న కాఠిన్యత....
మంచి చెడుల విలువుండదు.
న్యాయ అన్యాయాల వివేకముండదు.
ధర్మ అధర్మాల వివక్షఉండదు.
ఆసిడ్ దాడుల అపశ్రుతులు ....
అంతు చూడాలనుకునే ఆరాటాలు ....
ప్రేమించడం తప్పు కాదు.....
గుడ్డిగా ప్రేమించడం తప్పు .....
తటపటాయించే అడుగులేస్తే
తప్పు దిద్దుకోలేని జీవితపు ఆట.
ఆలోచన శక్తిలో జీవకోటికే సవాలు
విసరగల సత్తా కలిగిన మానవుడు.....
అన్నింటా అభివృద్ధిని ఆశించే మానవుడు....
అందుకోవాలి అసలు సిసలైన ప్రేమ.
కక్ష కక్ష్యను సృశించని ప్రేమ.
అజరామరం అయ్యే అమర ప్రేమ.
నగునూరి రాజన్న
కరీంనగర్.
No comments:
Post a Comment