అంశం : చుట్టం చూపు
తేదీ : 05-10-2018
శీర్షిక : అంటి ముట్టనట్టు
సంఖ్య : 71
అరయ బాల్యమందు
అమ్మ నాన్నలు గాదె
ఆత్మీయతలు పంచి
అరడజను మంది పిల్లలైనను
అక్కున చేర్చుకుని
అరికాలుకు మట్టి అంటనీయక
అలవోకగా పెంచి పెద్ద జేయ.
ఆనక ఆ పిల్లలే
పెరిగి పెద్దయ్యి
పిల్ల పాప కలిగాక
ముందు చూపే గాని,
అయ్యవ్వలప్పుడు
చుట్టపు చూపోలె
ఇచ్చపు ముచట్లకైన
నొచోకోక
నొచ్చుకొనుటె గాని
మెచ్చుకోలు లేని
జీవితమై నిలిచె....
అంటిముట్టనట్టుండు
అంతమంది గూడ.....
కలి ధర్మమెందుకో
కరుణ జూపదే !
రక్త మాంసాలను
రంగరించి పంచుకున్నా
అన్నదమ్ముల మధ్య
ఆడపిల్లగ పుట్టినందుకు
ఆడపిల్లగ పుట్టినందుకు
చుట్టపు చూపొలె
వచ్చి పోవు పుట్టింటికి.
No comments:
Post a Comment