Friday, October 5, 2018

జీవన తరంగాలు


జీవన తరంగాలు
27-09-2018 
శీర్షిక: అలల తరంగాలు 
సంఖ్య : 66

పట్టు తేనె తాగినట్టు 
పల్లె బతుకున గడిపిన బాల్యం... 

పట్టు తప్పి పరుగెత్తుడే 
పట్టణాన చదువుల రోజులు ..... 

ఆనందాల హరివిల్లులే 
కొంగ్రొత్త జీవితాల మధురిమలు ...... 

సుందర పరిమళ కుసుమాలే 
పిల్లలు కలిగిన ఇల్లులు ..... 

తొక్కుడు బండల బాధ్యతలే 
జీవన చక్రం తిప్పే ఉద్యోగాలు ..... 

మంచి చెడుల  సమాగమమే 
మర్మమెరుగని మనుజుల సోపతి ..... 

సుమధుర మేలిమి ఫలాలే 
అడుగు ముందుకేసి గమ్యాలు చేరే పిల్లలుంటే....... 

ఆరు రుచుల ఉగాది పచ్చడే 
అరిషడ్వర్గాలను  సమన్వయపరుచుకుంటే..... 

ఆదమరిచి పయనించొద్దు 
అలల తరంగాల జీవన తరంగాలను..  

నగునూరి రాజన్న 
కరీంనగర్  

No comments:

Post a Comment