Friday, October 5, 2018

మట్టెల సవ్వడి

అంశం: మట్టెల సవ్వడి
౦౩-10 -2018 
శీర్షిక : ఘల్లు ఘల్లున
సంఖ్య: 70 

సౌభాగ్యాల సూచనలు 
మహిళామణుల ధారణలు 
మాంగల్యముతో బాటుగా
మహిలో ధరింతురు వివాహాన
కులమతాల కతీతంగా మన దేశాన.  

సత్సాంప్రదాయాలకు ప్రతీక 
నాడీ వ్యవస్థ నడవడికై 
రక్షణ సూత్రంగా వర్ధిల్లే 
శాస్త్రీయతకు సైతం సంకేతంగా
గర్భధారణ  గండం గడువ  

లోహవాహకమై నర్తించ 
మహికి  మహిళకు  అనుసంధానంగా 
ఆరోగ్యాల అధిదేవతగా 
ఆచరింతురు పడతులకు
అక్కడక్కడా అనేకరీతుల విశ్వాన. 

వెండి ఉంగరాలు ఆచారంగా 
వనితలు పెళ్లిన ధరింతురు
మెట్టినింట అడుగిడు శోభగ
మెట్టెల సవ్వడి ఘల్లు ఘల్లన.  

నగునూరి రాజన్న

No comments:

Post a Comment