Friday, October 5, 2018

విజయాల నిచ్చెన

విజయాల నిచ్చెన 
28-09-18
శీర్షిక : గెలుపు గమ్యం.
సంఖ్య :  67

ఆలోచనాలెన్నయినా  ఉండొచ్చు...  
ఆచరించే పట్టుదల అలవర్చుకో... 
అందుకు తగ్గ ప్రణాళిక ఎంచుకో .... 
అందుకునే వరకు విశ్రమించొద్దు. 

ఆశయం ఏదైనా కావొచ్చు......  
అంకిత భావం అలవర్చుకో....  
అడ్డంకులెన్నయినా ఎదురవ్వచ్చు.... . 
అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలి. 

అయినవాళ్లు కూడా అర్థం చేసుకోపోవచ్చు,,,,,,,
అంతమాత్రానికే నిరుత్సాహపడొద్దు. 
అర్దాంతరపు ఆలోచనలతో విరమించొద్దు. 
ఆత్మస్తైర్యంతో  అడుగులేయాల్సిందే.  

గమ్యమేదైనా కావొచ్చు ..... 
గతులెన్నయినా మార్చుకో.... 
గమనమెలా అయినా నిర్ణయించుకో.... 
గమ్యం చేరేవరకు పరిశ్రమించు. 

అందుకు సాక్ష్యం అస్సాం జాన్ మోనీ పయోంగ్ 
హలం పట్టి పొలం దున్నుతూనే పట్టా పుచుకుంది. 
ఖమ్మం తల్లాడ నారాయణపురం జరీనా 
రోజుకూలి నుండి రోజా సమయాన 
నిర్మల్ లో అధ్యాపకురాలిగా ఉద్యోగ బాధ్యత. 

గెలుపు కొరకు చేసే ప్రతి ప్రయత్నం. 
గెలవాలనుకునే ప్రతి వారి ప్రయత్నం. 
గెలుపు పొందని ప్రతి ప్రయత్నం. 
గెలిచే వరకు విశ్రమించని తత్వం. 
గెలుపు గమ్యమే తీరని దాహమైనప్పుడు 
అన్నీ "విజయాల నిచ్చెన"కు  మెట్లే. 

నగునూరి రాజన్న 
కరీంనగర్ 

No comments:

Post a Comment